421
యేసు శరణుజొచ్చుట
రా – కేదారగౌళ, తా - త్రిపుట
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ - శక్తిహీనతఁ గల్గే నా = దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి - దవ్వుసేయక కావవే ||శరణు||
1. కరుణఁ జూడుము కన్న తండ్రివి – కల్మషం బెడఁబాపవే = మరణ మొందక మున్ను నన్నిల - మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||
2. మొరను జెచ్చెర నాలకించుచు - మోము నా దెసఁ జూపవే = యురు పదంబుల సేవఁ జేసెద - నుద్ధరించుము కూర్మితో ||శరణు||
3. తామస క్రియలందు వాంఛలు - తాకకుండగఁ జేయవ = క్షేమమైన సువార్త బోధల - సిద్ధపడి విననీయవే ||శరణు||
4. శ్రమలు చాల కల్గి యున్నను - సైఁప నేర్పుము సత్కృపన్ = గమిలి పోయెడి మాయ లోకపు - గాంతి నీరస మంచు నీ ||శరణు||
– మిక్కిలి సమూయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment