భజన చేయ రారే యేసుకు జయము పాడ రారే (2)
విజయుడైన మన యేసు మహిమ కొనియాడి పాడ రారే(2)
1.సజీవుడైన దేవుడు సమాధిలో ఇక లేడు (2)
వేసిన ముద్ర వ్యర్థమాయె - మూసిన రాయి దొరిలింపబడె (2) ||భజన||
2.నలువది రోజులిక్కడ ఉండి ధైర్యము చెప్పినవాడు (2)
శిష్యులకు తన దర్శనమిచ్చె - తోమాకు అనుమానము తీర్చె (2) ||భజన||
3.మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు చేసినవాడు (2)
చెప్పినట్లే తను లేచాడు - లేఖనములు నెరవేర్చినాడు(2) ||భజన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment