Bethlehemu Nagarilo Puripaaka | బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలో

బెత్లెహేము నగరిలో – పూరిపాక నీడలో
పాప నవ్వు విరిసేను – పాపి గుండె కరిగెను

కన్నె మరియ కన్నతలిరా- ఎన్నటికి మరువలేని కల్పవల్లిరా
లాలి లాలి లాలని యేసు బాల జోలని –
లోకమంతా ఊయలగా - ఊపినట్టి దేవతరా – 
లాలిజో... జో... లాలిజో... ||బెత్లెహేముు||

లేమి ఇంటవున్నవాడుగా - వెలసినావు ప్రేమ జ్యోతిగా
నీవు లేని హృదయము - ఏమి లేని సదనము
ఏమి సుఖము పొందుటకొ పుట్టినావు తోట్టిలో – 
లాలిజో... జో... లాలిజో... ||బెత్లెహేముు||

పల్లెలోని గొల్లవారలు - వెల్లిరిగా ప్రభుని చూడ తెల్లవారులు
మంచి గొర్రెల కాపరి - మనకు వెలుగునిచ్చురా
మందలన్నీ  మెపుటకే - కన్నె మరియ కన్నదిరా
లాలిజో... జో.. లాలిజో... ||బెత్లెహేముు||


DOWNLOAD MP3 SONG HERE

No comments: