సరిరారు నీకిల ఎవరు సరిరారు నా యేసు (2)
సరిరారు నా యేసు
1. మహాఘనుడా మహిమోన్నతమైన - స్థలములలోనే నివసించువాడా (2)
వినయము కలవారు నలిగిన నరులు వీరులు (2)
చెంత నివసించి బలపరచు వేడ
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం..
2. నా దోసములె నీకును నాకును - అడ్డముగా నిలుచుండె నయ్యా (2)
విననేరకుండుటకు మందముకాలేదు నీ చెవులు (2)
నన్ను మన్నించి నా మనవి వినవా (2)
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం.
3. నా పాపములే నీముఖమును నాకు - కనబడకుండా కప్పెనయ్య (2)
రక్షించనేరక యుండుటకెన్నడు నీ చేతులు (2)
కురుచ కాలేదు కరుణా కిరీటి (2)
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం ||సరిరారు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment