కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా -
వాక్యమైయున్న యేసు వందనమయ్యా(2) ||నీ వాక్యమే||
1.జిగటగల ఊభినుండి లేవనెత్తెను -
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను -
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||
2.శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై -
యుద్ధమునకు సిద్ధమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని బాణములను -
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||
3.పాలవంటిది జుంటి తేనె వంటిది -
నా జిహ్వకు మహా మధురమైనది -
మేలిమి బంగారుకంటే మిన్నయైనది -
రత్న రాసులకన్నా కోర తగినది(2) ||నీ వాక్యమే||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment