Naa Vimochakuda Yesayya | నా విమోచకుడా యేసయ్యా నీ జీవన

నా విమోచకుడా యేసయ్యా .....
నీ జీవన రాగాలలో - నీ నామమే ప్రతిధ్వనించెనే(2)
నా విమోచకుడా యేసయ్యా .....

1. నీతిమంతునిగా నన్ను తీర్చి -
    నీదు ఆత్మతో నను నింపినందునా (2)
    నీవు చూపిన నీ కృప నేమరువలేను (2)
                                    ||నా విమోచకుడా||
2. జీవ వాక్యము నాలోన నిలిపి
    జీవమార్గమలో నడిపించి నందునా (2)
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను (2)
                                    ||నా విమోచకుడా||
3. మమతలూరించె వారెవరు లేరని 
    నిరాశల చెరనుండి విడిపించినందునా (2)
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను (2)
                                    ||నా విమోచకుడా||

No comments: