Naa Prardhanalanni Aalakinchinavu | నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు(2)
                                || నా ప్రార్థనలన్ని ||
1. అడిగినంతకంటె అధికముగా చేయు
    ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా (2)
    పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
    పరిశుద్ధతకే శుభ ఆనవాలు (2)
                                || నా ప్రార్థనలన్ని ||
2. ఆపత్కాలములో మొరపెట్టగానే
    సమీపమైతివే నా యేసయ్యా (2)
    సమీప భాందవ్యములన్నిటికన్నా
    మిన్నయైనది నీ స్నేహబంధము (2)
                               || నా ప్రార్థనలన్ని ||
3. ఎక్కలేనంత ఎత్తైన కొండపై
    ఎక్కించుము నన్ను నా యేసయ్యా (2)
    ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
    ఆత్మీయతకే స్థిరపునాదులు (2)
                              || నా ప్రార్థనలన్ని ||

No comments: