నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ (2)
||నా గీతా||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో - మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2)
||నా గీతా||
చేనిలోని పైరు చేతికి రాకున్నా - ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా - నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2)
||నా గీతా||
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2)
||నా గీతా||
No comments:
Post a Comment