ఘనమైనవి నీ కార్యములు నా యెడల -
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి - స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
1.ఏ తెగులు సమిపించనీయ్యక - ఏ కీడైన దరిచేరనీయ్యక - ఆపదలన్నీ తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగేవరకు (2)
నా భారముమోసి బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
2.నాకు ఎతైన కోటవు నీవే - నను కాపాడు కేడెము నీవే - ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించు చున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
3.నీకృపతప్ప వేరొకటి లేదయ - నీ మనస్సులో నేనుంటే చాలయ - బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నాయెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువా
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము || ఘనమైనవి ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment