ఎంత ఘోరమయ్య - నీ సిలువ త్యాగము
ఎంత భారమయ్య - నా పాప దోషము (2)
అణువణువున రక్తసిక్తమై - మాంసపు ముద్దగా మారితివా(2) శ్రమల సిలువను ... మోసితివా (2)
1. పరమతండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు - పరము వీడి భువిపై కరుణించినావయ్యా - దేవునివైయుండి ఈ మనుషుల చేత - చిత్రహింస పడినావయ్యా
కోరడాల దెబ్బలు కొట్టి - తలకు ముళ్ళ కిరీటమెట్టీ -
మోమున ఉమ్మివేసి - అపహసించి నెట్టినారా -
నా కోసమా - ఈ బలియాగము - ఎవరు చేయగలరు ఇంత త్యాగము
||ఎంత||
2. వధకు తేబడిన గొర్రపిల్లవోలె - నిన్ను నీవే అర్పించుకుంటివే - భారమైన ఆ సిలువను కలువరి వరకు - నీ భుజమున పెట్టుకోని మోసితివే -
కాళ్ళచేతులలో మేకులు - నేలపై రక్తధారలు చేదుచిరక త్రాగనిచ్చెను - ప్రక్కలో బల్లెముతో పోడిచెను -
నా కోసమా -ఈ బలియాగము - ఎవరు చేయగలరు ఇంత త్యాగము (2)
||ఎంత||
3. నా పాప శిక్షను నీవు బరియించి - ఘోరమైన శ్రమను నీవు పొందితివా - మానవుల పాపనికి మరణమె జీతమని - నా కోరకై నీవు మరణించితివా -
మహిమనువీడి వచ్చితివీ - నిత్య మహిమ మాకిచ్చితివీ - మరణపు ముళ్ళు విరిచితివి - నిత్యజీవం మాకిచ్చితివి -
ఈ పాపి కోసమా - ఈ బలియాగము - ఎవరు చేయగలరు ఇంత త్యాగము (2)
||ఎంత||
No comments:
Post a Comment