Deva Nee Sakshiga | దేవా నీ సాక్షిగా నేనుండుంట

దేవా నీ సాక్షిగా నేనుండుంట- ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై , కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు, నా తుది శ్వాస ఆగేవరకూ
                                   ||దేవా నీ సాక్షిగా||
1. నాలాంటి నరమాత్రుని చేరుట 
    నీవంటి పరిశుద్ధునికేలనో (2)
    ఏ మేధావికి విదితమే కాదిది
    కేవలం నీ కృపే దీనికాధారము
    ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
    నా బ్రతుకంతా కొనియాడుట 
                                     ||దేవా నీ సాక్షిగా||
2. నా ఊహకందని మేలుతో -
    నాా గుండె నిండింది ప్రేమతో |2|
    నా కన్నీటిని మార్చి పన్నీరుగా,
    నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
    ఈ శుభవార్తను చాటు సందేశము, 
    నేను ఎలుగెత్తి ప్రకటించెద
                                     ||దేవా నీ సాక్షిగా||

No comments: