Aashraya Durgama Naa Yesayya | ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ||

1.లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే -
ఆత్మీయులతో అక్షయఅనుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి(2) ||ఆశ్రయ||

2.నాతోనీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే-
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి(2).||ఆశ్రయ||

3.పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీకృప పొందెద (2)
అందుకే ఈస్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2).||ఆశ్రయ||

4.నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||

Download MP3 song Here 👇

No comments: