జనములు మీదికి జనములు లేచును - రాజ్యము మీదికి రాజ్యము లేచును (2)
భూమెండుగా కరువులు కలుగును - భూకంపములు ఎక్కువ కలుగును (2) కడు వేదనలు నీకు చెలరేగును||కమ్ము||
చీకటి సూర్యుని కమ్మేడి వేళ - చంద్రుడు కాంతిని ఇవ్వని వేళ (2)
ఆకాశ మేఘారూరుడై - ప్రకాశ ప్రభావముతో (2)
ఎటు పోయేదవు నీవు పరికించుకో.. ||కమ్ము||
ఆరని అగ్ని గుండము అదిగో - రోదన ధ్వనులు రేగెను అవిగో (2)
నాశన నరకము అదిగో - మోక్షానికి మార్గం అదిగో (2)
ఎటు పోయేదవు నీవు పరికించుకో..||కమ్ము||
ఆ దినమేదో అలయగ రాదు - ఆ గడియేదో తెలియగ రాదు (2)
కడు మెలుకువ కలిగి వినుమా - కడు హేళన చేయక కనుమ (2)- కడు వేగముగ వచ్చు ప్రభు రాకడ ||కమ్ము||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment