నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీ మాట||
1.ఎన్ని బాధలున్ననూ - ఇబ్బందులైననూ -
ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ (2) ||నీ మాట||
2.బ్రతుకు నావ పగిలినా - కడలి పాలైననూ -
అలలు ముంచి వేసినా - ఆశలు అణగారినా (2) ||నీ మాట||
3.ఆస్తులన్నీ పోయినా - అనాథగా మిగిలినా -
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||
4.నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము -
నీదు కృపతో నాకేమియు - కాదిల సమానము (2) ||నీ మాట||
– రచన: శ్యామ్ జె వేదాల
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment