Nee Prema Naalo Madhuramainadi | నీ ప్రేమ నాలో మధురమైనది

నీ ప్రేమ నాలో మధురమైనది 
అది నా ఊహకందని క్షేమ శిఖరము ( 2 ) 
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను 
పరవశించి నాలో మహిమ పరతు నిన్నే 
సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు 
సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే 
                                            ||నీ ప్రేమ నాలో||
1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - 
    కాదనలేదే నా మనవును నీవు (2) 
    హృదయం నిండిన గానం- నను నడిపే ప్రేమ కావ్యం
    నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
    ఇది నీ బహు బంధాల అనుబంధమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
    నా యేసురాజా ఆరాధన నీకే (2)
                                            ||నీ ప్రేమ నాలో||
2. నా ప్రతి పదములో జీవము నీవే-
    నా ప్రతి అడుగులో విజయము నీవే ( 2 ) 
    ఎన్నడు విడువని ప్రేమ- నిను చేరే క్షణము రాదా
    నీడగా నాతో నిలిచే -నీకృపాయే నాకు చాలును(2)
    ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా 
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
    నా యేసురాజా ఆరాధన నీకే (2) 
                                            ||నీ ప్రేమ నాలో||
3. నీ సింహాసనము నను చేర్చుటకు-
    సిలువను మోయుట నేర్పించితివి (2) 
    కొండలు లోయలు దాటే-మహిమాత్మతో నింపినావు
    దయగల ఆత్మతో నింపి- సమాభూమిపై నడిపినావు 
    ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా 
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
    నా యేసురాజా ఆరాధన నీకే (2)
                                           ||నీ ప్రేమ నాలో||

No comments: