Devuni Sthuthincha Randi | దేవుని స్తుతించ రండి

దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా
 
1.కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టములబాపి మనల నింక జగమున జీవితులుగ నుంచినట్టి - మహ ||దేవుని ||

2.ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా నిరతము కాచి చక్కగనుప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి ||దేవుని ||

3.ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగ నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి ||దేవుని ||

4.వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింప దైవకుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి - మహా ||దేవుని ||

5.భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి ||దేవుని ||

6.ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునపుడు నీ సన్నిధిని - చూపి ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా ||దేవుని ||

7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు ||దేవుని ||

No comments: