Sarvashakthuda O Satya Devuda | సర్వశక్తుడా ఓసత్య దేవుడా

సర్వశక్తుడా ఓసత్య దేవుడా సర్వదా 
నిన్ను నే - స్మరియింతును ఆనందమే మహదానందమే - ఆశ్చర్యకరుడు యేసుండు నాపాపములు క్షమియించెను

1. చెఱనుండి నేను మొర పెట్టగా - పరమునుండి ఉత్తరమిచ్చెన్ ||ఆనందమే||

2. గూఢమైన సంగతులన్ - గ్రహియించునట్లు ప్రభుచేయున్||ఆనందమే||

3. అడుగు వాటికన్న ప్రభు - అత్యధికముగా దయచేయున్||ఆనందమే||

4. ఊహకు మించిన కార్యములన్ - మన ప్రభు నడిగిన వేర్చును||ఆనందమే||

5. మనవి చేయుచుండగ - ఘనమైనదేవుడాలించున్||ఆనందమే||

6. వేడుకొనక మునుపే ప్రభువు - వడిగా మాకుత్తరమిచ్చున్||ఆనందమే||

7. మునుపటికన్నా అధికముగా - మేలులుమాకు కలుగజేయున్||ఆనందమే||

8. ఇశ్రాయేలును కాచు దేవుడు - విశ్రమించడు కునుకడు||ఆనందమే||

9. ప్రార్థనకు ప్రతిఫలముల్ - ప్రియుముగ నొసగును - హల్లెలూయ ||ఆనందమే||

No comments: