Sajeevudavaina Yesayya | సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీవారికి -
సహాయుడవై తృప్తిపరచితివే - సముద్రమంత సమృద్ధితో(2)
ఆనందించెద నీలో - అనుదినము కృపపొంది     
ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో (2)
                                                  ||సజీవుడవైన||
1. ధనరాసులే ఇల ధనవంతులకు ఈలోకభాగ్యము -
దాచినమేలులెన్నో దయచేసినావే - ఇహపరమున నాకు (2)
శ్రమల మార్గమును - నిరీక్షణ  ద్వారముగ చేసితివే
శ్రేష్ఠమైననీ వాగ్దానములతో (2)         
                                                  ||సజీవుడవైన||
2. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగామారె -
 క్షేమాధారమునీవై దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను (2)
నిత్యనిబంధనగా నీవాత్సల్యమును చూపితివే
నిత్యమైననీ సత్యవాక్యముతో (2)
                                                 ||సజీవుడవైన||
3. నలువది యేండ్లు నీస్వాస్థ్యమును మోసినది నీవే - 
నీ కృపా కాంతిలో నాచేయివిడువక - నడిపించుచున్నది నీవే (2) 
పరమరాజ్యములో మహిమతోనింపుటకు
అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును
                                              ||సజీవుడవైన||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: