పరిశుద్ధ దేవుని స్తుతించెదము
క్షేమముగ మమ్ము నడిపించెను
నిత్యకాలము గీతములు పాడి
కీర్తించి పొగడెదము - హల్లెలూయ
||పరిశుద్ధ||
1. గడిచిన కాలము కృపలతో - కనికరముతో-
కౌగలించెమనలన్ - మన పాదముల్ -
పర్వతము పై = నిత్యము నిలిపి నడిపించును
||పరిశుద్ధ||
2. యోర్దాను నదివలె కష్టములు - యేసుని బలముతో
దాటితిమి - ప్రభు కరముల్ పట్టుకొని =
పరిశుద్ధ త్రోవలో నడిపించును
||పరిశుద్ధ||
3. పక్షిరాజువలె నీ వయస్సు- మరల
యౌవనమగుచుండును మేలులతో
బలముతోను= నింపి మనలను తృప్తిపరచున్
||పరిశుద్ధ||
4. దావీదుకు ఒసగిన కృపలన్ - దాసులమైన
మన కొసగున్- ఎలీషావలె రెట్టింపైన =
శక్తితో మనల నభిషేకించున్
||పరిశుద్ధ||
5. క్షేమముగా ప్రభుని కృపలో ఇంతవరకు మమ్ము -
నడిపించెను కనుపాపగా కడవరకు =
కాపాడే ప్రభుని స్తుతించెదము
||పరిశుద్ధ||
No comments:
Post a Comment