118
బాల యేసు దర్శనము
రా - జంఝుటి, తా - ఆది
మేము వెళ్లిచూచినాము - స్వామి యేసు క్రీస్తును = ప్రేమ మ్రొక్కి వచ్చినాము - మా మనంబు లలరగ ||మేము||
1.బేదలేము పురములోన - బీద కన్యమరియకు = బేదగా సురూపు దాల్చి - వెలసె బశులపాకలో ||మేము||
2.జ్ఞానులమని గర్వపడక - దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు - మానక ప్రకటింతము ||మేము||
3.తద్దరిశన మందు మాకు - బెద్ద మేలు గలిగెగా = హద్దు లేని పాపమంత - రద్దుపరచ బడెనుగా ||మేము||
4.మరణ మెప్పోడో రేపొమాపో - మరి యెపుడో మన మెరుగము = త్వరగా పోయి పరమ గురుని - దరిశనంబు జేతము ||మేము||
5.పరిశుద్ధాత్మ జన్మ మాకు - వరముగా నొసంగెను = పరమ పురము మాకు హక్కు - పంచెదాను నిరతము ||మేము||
6.మాకు సర్వ గర్వమణిగి - మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్త - జెప్ప మక్కువెంతో గలిగెను ||మేము||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment