వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసురాజు - భూజనులనేలున్
హల్లెలూయ హల్లెలూయ - దేవుని స్తుతియించుడి
1.తంబురతోను వీణతోను -ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను - తాళములన్ మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి
||రాజుల||
2.సూర్యచంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును ఛేదించిన నాధుని స్తుతియించుడి
||రాజుల||
3.యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించ
జీవితమున్ ప్రభుపనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా -యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి
||రాజుల||
4.అగాధమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వభక్తలారా- దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి
||రాజుల||
No comments:
Post a Comment