హల్లెలూయ దేవునికే - హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునకే - హల్లెలూయ రాజునకే ||హల్లెలూయ||
1. మాపాదముల్ జారకుండా - మా నడతలు స్థిరపరచు కనుపాపవలె కాపాడుము - కృపతో నిత్యము నడిపించుము ||హల్లెలూయ||
2. దేవనీదు సముఖమందు నిత్యము ఉంచి
నడిపించుము సదా నిత్యము జయించెదము
దేవబలముతో నింపునన్ను ||హల్లెలూయ||
3. బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమముల్
వెంటవచ్చున్ దైవ వాక్యమునకు లోబడెదం
దైవ రూపము పొందెదము ||హల్లెలూయ||
4. అనుదినము ప్రభుయేసునాకు ఆశ్రయందుర్గమై
యుండును కలిమిలేమి ఏ స్థితిలో నైనా
నాదు ఆశ్రయం యేసయ్య ||హల్లెలూయ||
No comments:
Post a Comment