సీయోనులోనుండి దీవించువాడవు సదాకాలము జీవించువాడవు సాగిలపడినే నమస్కరించి సర్వదా నిను కొనియాడెద నిన్నే కీర్తించెదా(2)
||తండ్రియైన||
1. సర్వాత్రిక సంఘస్థాపకుడా సర్వలోక రక్షకుడా (2)
సిలువలో నీరక్తమే నాకై కార్చితివి
శిధిలముకాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీకీర్తి తలచి
సర్వలోకాన నీ మహిమను నేను ప్రకటింతును(2)
||తండ్రియైన||
2. సర్వసత్యమునకు ఆధారమై పరిశద్ధ -
యాజకుల సారధివై(2)
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచర్య నే చేయుటకై
నూతన కృపలను నే పొందెద ఆత్మశక్తితో సాగెద(2)
||తండ్రియైన||
No comments:
Post a Comment