686
రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు -
సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2)
1.పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి
శుద్దుడు పరిశుద్ధు డనుచు- పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి||
2.జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి||
3.పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే
గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి||
4.నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె - రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి||
5.అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ
దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే (2) ||రేయి||
6.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే
అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి||
7.మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||
___________________________________
Reyi pagalu nee padaseve -
jeevadayakame cheyuta melu -
saatileni devuda neeve -
naadu kota kondayu neeve (2) ||Reyi||
1.Paramapurilo deva niratham -
dootha ganamulu sthuthulanu salpi -
Suddudu pari suddhudanuchu -
pooja nonde devuda neeve (2) ||Reyi||
2.Jigatamanne marachi janulu -
shrushtine poojinchuta thaguna -
srushtikarthanu marachi janulu -
shrushtine poojinchuta taguna(2) ||Reyi||
3.Pentakuppala nundi deenula -
paikilepu prabhudavu neeve -
garvamanichi gaddelu dhimpi -
ghanulanainaa mepavaa gaddİ ||Reyi||
4.Narula nammutakante nijamuga -
needu charanam saranam devaa -
raajulanu dhara nammutakante -
raajaraajavu nakasrayamu (2) ||Reyi||
5.Agni vasana nantakunda -
Abednagolatho nundina deva -
daaniyelunu simhapu bonulo -
aadukunna naadhuda neeve (2) ||Reyi||
6.Parama gurudavu prabhulaku prabhudavu -paramu jerche padhamu neeve -
adugu jaadalo nadachina Hanoku -
paramu chere praanamu toda (2) ||Reyi||
7.Mruthulu sahithamu lepinaavu -
mruthini gelchi lechinaavu -
mruthulanella lepevadavu -
mruthyuvunu mruthi jesithi neevu (2) ||Reyi||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment