1.నా జీవిత కాలమంతయు -నే నెహోవానే స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయూ - నాదేవుని కీర్తింతున్ (2) ||హల్లెలూయ||
2.రాజులచేతనైనను - మరి నరుల చేతనైనను
రక్షణ భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి (2) ||హల్లెలూయ||
3.వారి ప్రాణము నశియించును - వారుమంటిలో గలసెదరు
వారి సంకల్పములన్నియు నాడే - నాశనము నొందును (2) ||హల్లెలూయ||
4.యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో
యెవడెహోవా మీద ఆశ పెట్టునో వాడే ధన్యుండు (2) ||హల్లెలూయ||
5.ఆకాశభూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్
ఆ తండ్రి యెన్నండైన తన మాటలు తప్పనివాడు (2) ||హల్లెలూయ||
6.బాధనొందు వారికి - అతడే న్యాయము తీర్చున్
ఆకలిగొని నట్టి వారికి ఆహారము దయ చేయున్ (2) ||హల్లెలూయ||
7.బాధింపబడిన వారి - బంధము లాయన తెంపున్
పుట్టంధుల కన్నులు యెహోవా తెరువ జేసెడివాడు (2) ||హల్లెలూయ||
8.కృంగినట్టి జనులను - నింగి కెత్తెడు వాడాయెనే
నీతిమంతుల నెల్లరిని - యెహోవా ప్రేమించెన్ (2) ||హల్లెలూయ||
9.పరదేశ వాసులను - కాపాడు వాడాయనే
నేదిక్కులేని వారిని - విధవల నాదరించును(2) ||హల్లెలూయ||
10.భక్తిహీనుల దారిని - వంకరగా జేయును
యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును (2) ||హల్లెలూయ||
11.సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్యమేలును
యోహోవాను స్తుతించుడి - హల్లెలూయ ఆమెన్ (2) ||హల్లెలూయ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment