అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులేలేనిది||
1. ఊహించలేని హృదయానందమును
దు:ఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైన తీరము కడుదూరమైన
నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులేలేనిది||
2. సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీరూపము తలచుకొందును -
నేను నీకోసమే వేచియుందును (2) ||అవధులేలేనిది||
3. లెక్కించలేని అగ్నిశోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు -
వెనుకున్నవి మరచి నేను లక్ష్యమువైపు సాగెద (2) ||అవధులేలేనిది||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment