Yuddamu Yehovade Yuddamu | యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే (2) 
రాజులు మనకెవ్వరు లేరు- శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన - యెహోవా మన అండ 
యుద్ధము యెహోవాదే (4) 

1. బాధలు మనలను కృంగదీయవు - వ్యాధులు మనలను పడద్రోయవు (2)
విశ్వాసమునకు కర్తయైన - యేసయ్యే మన అండ
యుద్ధము యెహోవాదే (4) 

2. యెరికో గోడలు ముందున్న - ఎఱ్ఱసముద్రము ఎదురైన (2)
అద్భుత దేవుడు మనకుండగా - భయమేలా మనకింక
యుద్ధము యెహోవాదే (4) 

3. అపవాదియైన సాతాను - గర్జించు సింహమువలె వచ్చిన (2)
యూదా గోత్రపు సింహమైన - యేసయ్యే మన అండ
యుద్ధము యెహోవాదే (4)

Download here MP3 song 👇

No comments: