Sri Yesundu Janminche | శ్రీ యేసుండు జన్మించె రేయిలో

121               యేసుని జననము
రా - మఖారి.                                 తా - అట
శ్రీ యేసుండు జన్మించె రేయిలో - నేఁడు - పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు||
1. కన్నియ మరియమ్మ గర్భమందున - ని - మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||
2. సత్ర మందునఁ బశువుల సాలయందున - దేవ - పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||
3. పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి - పసుల - తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు||
4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ - దెల్పె - గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు||
5. మన కొఱకొక్క శిశువు పుట్టెను - ధరను - మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు||
6. పరలోకపు సైన్యంబుఁ గూడెను - మింట - వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||
7. అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||
                                - కొమ్ము కృప

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: