Sakshyamicheda Mana Swami Yesu | సాక్ష్యమిచ్చెద మన స్వామి

 356
క్రైస్తవ సాక్ష్యము
రా - హిందుస్థాని ముఖారి, తా - జుల్వ 

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు = సాక్ష్యమిచ్చెద సాక్ష్యమనగ గనిన వినిన - సంగతులను దెల్పుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను - స్వామి రక్షించెనంచు ||సాక్ష్య||

1.దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతో కనికరించి =  మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడో ||సాక్ష్య||

2.పల్లెటూళ్ల జనుల రక్షణ - భారము నా పైని గలదు = పిల్లలకును పెద్దలకును - ప్రేమతో నాస్వానుభవము ||సాక్ష్య||

3.బోధచేయలేను వాద - ములకు బోను నాకదేల = నాధుడేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు ||సాక్ష్య||

4.పావులకు మిత్రుడంచు - బ్రాణమొసగి లేచెనంచు = పాపముల క్షమించునంచు - ప్రభునివిశ్వసించుడంచు ||సాక్ష్య||

5.చోరులైన జారులైన - చారులైన నెవ్వరైన = ఘోర పాపులైన క్రీస్తు - కూర్మితో రక్షించునంచు ||సాక్ష్య||

6.పరమత దూషణములేల - పరిహసించి పలుకుటేల = ఇరుగు పొరుగు వారికెల్ల - యేసుక్రీస్తు దేవుడంచు ||సాక్ష్య||

7.ఎల్లకాల మూరకుండ - నేల యాత్మ శాంతిలేక = తల్లడిల్లు వారలకు - తండ్రి కుమారాత్మ పేర ||సాక్ష్య||
  - మల్లెల దావీదు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: