26
95 – వ దావీదు కీర్తన
రా – శంకరాభరణము, తా – ఆది
రండి యుత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
1.రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము = సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము || రండి ||
2.*మన ప్రభువే మహా దేవుండు - ఘన మాహాత్మ్యము గల రాజు = భూమ్య గాధపు లోయలును - భూధర శిఖరము లాయనవే || రండి ||
3.సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువిఁజేసెన్ = ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొఱ్ఱెలము || రండి ||
4.ఆ ప్రభు సన్నిధి మోఁకరించి - ఆయన ముందర మ్రొక్కుదము = ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మనకెంతో మేలగును || రండి ||
5.తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుఁగాక = ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్ || తండ్రి ||
- నమూయేలు పాక్యవాధము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment