Rakshakundu Udayinchinadata | రక్షకుండుదయించి నాడట

112
రక్షకుని జననము
రా - మాధ్యమావతి, తా - ఆట

రక్షకుండుదయించి నాడట - మన కొరకు బరమ - రక్షకుం డుదయించి నాడట  =  రక్షకుం డుదయించినాడు  -  రారె గొల్ల బోయులార - తక్షణమున బోయి మన ని - రీక్షణ ఫలమొందుదము ||రక్షకుండు||

1.దావీదువంశమందు - ధన్యుడు జన్మించినాడు =  దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||

2.గగనమునుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత =  తగినట్టు చెప్పె వారికి - మిగుల సంతోషవార్త ||రక్షకుండు||

3.వర్తమానము జెప్పి దూత - వైభవమున బోవుచున్నాడు = కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమంబప్పుడు ||రక్షకుండు||

4.పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రములజుట్టి = శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె ॥రక్షకుండు ॥ 

5.అనుచు గొల్ల లొకరి కొక  -  రానువాలు జెప్పుకొనుచు = అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
  - మోచర్ల రాఘవయ్య

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: