675
ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం ముదమార వసించునా - హృదయాంతరంగమున ||ప్రియ||
1. నీ రక్తప్రభావమున - నారోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ - ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
2. అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడిచి
కరుణారసముతో సాకై - కని పెట్టితివి తండ్రి ||ప్రియ||
3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనె
చేరితి నీదుదారి కోరి - నడిపించుము ||ప్రియ||
4. ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా- నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా ||ప్రియ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment