641
ఓ సంఘమా - సర్వాంగమా - పరలోకరాజ్యపు ప్రతిబింబమా
మెస్సయ్యను - ఎదుర్కొనగ - నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా - వినుమా
1. రాణి ఓ ఫిరు అపరంజితో - స్వర్ణవివర్ణ వస్త్రధారణతో - వీణావాద్య తరంగాలలో - ప్రాణేశ్వరుని ప్రసన్నతతో - ఆనందతైలా సుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ సంఘమా||
2. క్రీస్తే నినును ప్రేమించెనని - తన ప్రాణాలర్పించెనని - స్వస్థపరచే నిర్దోషముగా - ముడత కళంకము - లేనిదిగా
మహిమ యుక్తంబుగా - నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ సంఘమా||
3.చీకటిలోనుండి వెలుగునకు - లోకములోనుండి వెలుపలకు - శ్రీకర్తగుణాతిశయములను - ప్రకటించుటకే పిలచెనని - గుర్తించుచుంటివా క్రియలను గంటివా - సజీవముగా నున్నావా ||ఓ సంఘమా||
4. వ్యభిచారులు నరహంతకులు - పోకిరిచేష్టల డాంబికులు - అబద్ధజనకుని యాసనము - యెజెబెలు నీ మధ్య నివసించెనా -
కృపావరములు - ఆత్మల భారములు ఉజ్జీవ దాహము కలదా ||ఓ సంఘమా||
5. చల్లగనైనా వెచ్చగనూ - ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే - బయటకు ఉమ్మబడెదవేమో
నీమనస్సు మార్చుకో - తొలి ప్రేమ కూర్చుకో - ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ సంఘమా||
6. కడపటి బూర మ్రోగగనే - కనురెప్పపాటున మారుదువా
వడిగా మేఘాసీనుడవై - నడియాకాశము పోగలవా
గొట్టే పిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా - రారాజు నెదుర్కొనగలవా ||ఓ సంఘమా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment