నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం
1. నీ సత్యము సమాజములో -
నీ నీతిని నాహృదయములో
దాచియుంచలేను ప్రభు (2)
స్తుతి యాగముగా నూతన గీతము
నేపాడెద నేపాడెద ||నాప్రాణ||
2. జ్ఞానులకు నీ సందేశం -
మతకర్తలకు నీ ఉపదేశం
అర్ధము కాకపోయెనే (2)
పతిత లెందరో నీజీవ జలములు
త్రాగితిరే త్రాగితిరే ||నాప్రాణ||
3. నా యెడ నీకున్న తలంపులు -
బహు విస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పాలేనె (2)
అవి అన్నియు లెక్కకు మించినవై
యున్నవి అయి యున్నవి ||నాప్రాణ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment