Kraisthavunda Kadali Ravayya | క్రైస్తవుండా కదిలిరావయ్యా

క్రైస్తవుండా కదిలిరావయ్యా - కలుషాత్ములకు 
యీ సిలువశక్తిని జాటవేమయ్యా - యెండ వానలనియు
జడిసి - ఎంతకాలము మూల నుందువు- కండలను ప్రేమింతువేమన్నా - ఈ మంటి కండలు
ఎంత బెంచిన మంటి కేనన్నా ||క్రైస్తవ||

1. వసుధలో ప్రజలెల్లరు యేసు - 
    వాక్యంబు వివక్షుద్బాధకొని - వాంఛించు  
    చుండగను - మిషనులెల్లను మిషలచేత
    మిట్టిపడుచు వాదములతో - యేసు బోధను
    విడచినారన్నా నీవెంతకాలము - 
    వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ||

2. సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల
    బత్యములపై భ్రాంతులు నిలిపి - చిత్రమగు
    అనుకూల - బోధలు చేసి బ్రజలను మోసగించు
    సూత్రధారుల - జేర రాదయ్యా సుఖభోగమిడిచి 
    సత్యవాక్యము చాట రావయ్యా ||క్రైస్తవ||

3. శక్తిహీనుడనందు వేమయ్యా - సౌజన్యమగు
    శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా - భక్తిహీనత 
    పారద్రోలు భ్రష్ట మనస్సు - బయలుపరచు
    శక్తికలుగు సువార్త చాటుదువు - సువార్త చేయ 
    జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||

4. నీతికై భక్తాదిపరులెల్ల - నిజవిశ్వాసము
    నిలుపుకొన పోరాడిరే - చాల కత్తిపోటులు
    రాళ్ళదెబ్బలు కరకు గల రంపములు కోతలు
    బెత్తములు కొరడాల దెబ్బలు - పైబడి చీలి
    దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||

5. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ణ నీరో 
    అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల 
    స్థంభముల గట్టి తారుపూసి అగ్నిని ముట్టించి 
    కాల్వంగ ఆ సంఘ మెచ్చె 
    అధిపతి అప్పుడే నశియించె ||క్రైస్తవ||

6. దూతలకు లేనట్టి పరిచర్య - ఓ ప్రియ సఖుండా
    ఖ్యాతిగా నీ కిచ్చె గ్రంథంబు - భీతియేల తినుము
    గ్రంథము - తేనెవలె మధురముగ నుండున - 
    జ్ఞానము నీకబ్బునో హితుడ జ్ఞానంబునొంది . 
    స్వామిని సేవించుమో సఖుండా ||క్రైస్తవా||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: