కన్ను బ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా
1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా
2. పాపులకై వచ్చినవాడా - ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా
3. దీవెనలు నిచ్చువాడా - వసుధ కేతెంచినవాడా
నీవే సుంకరలాప్తుడవు - సిలువలోని మిత్రుడా
4.ఐదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదువేల
జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా
5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా - సిలువలోని మిత్రుడా
6. రోగులను బాగుచేయువాడా-గ్రుడ్డికి నేత్రములిచ్చితివి
అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా
7. హల్లెలూయ కరుడా - యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా - సిలువలోని మిత్రుడా
||కల్వరి||
No comments:
Post a Comment