165
యేసుని నిరుపమాన ప్రేమ
రా - ఆనంద భైరవి, తా - అట
ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను - తులనాడక తనదు = జాలి చుపినదా||ఈలాటి||
1.ఎనలేని పాపకూపమున - నేను - తనికి మినుకుచును నే - దరిఁ గానకు డన్ = కనికరము బెంచి నా యందు - వేగం - గొని పోవ నా మేలు - కొర కిందు వచ్చె ||ఈలాటి||
2.పెనుగొన్న దుఃఖాభిలోన - నేను - మునింగి కుములుచు నేడు - పునగుందు నపుడు - నను నీచుఁడని త్రోయలేక - తనదు నెనరు నా కగుపరచి నీతిజూపించే ||ఈలాటి||
3.నెమ్మి రవ్వంతైన లేక చింత - క్రమ్మి పొగలుచు నుండ - గా నన్ను జూచి = సమ్మతిని నను బ్రోవ దలచి - కరముం - జాచి నా - చేయిబట్టి - చక్కగా బిలిచె ||ఈలాటి||
4.పనికిమాలిన వాడనైన - నేను - కనపరచు నాదోష - కపట వర్తనము - మనసు నుంచక తాపపడక యింత - ఘనమైన రక్షణ - మును నాకు జూపె ||ఈలాటి||
5.నా కోర్కె లెల్ల సమయములన్ - క్రింది - లోక వాంఛల భ్రమసి - లొంగెడు వేళన్ = చేకూర్చి దృఢము చిత్తమునన్ - శుభము - నా కొసంగె జీవింప - నా రక్షకుండు ||ఈలాటి||
6.శోధనలు నను జుట్టినపుడు - నీతి - బోధ నా మనసులో - బుట్టించి పెంచి = బాధ లెల్లను బాపి మాపి - యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు ||ఈలాటి||
- రావూరి రంగయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment