564
దైవాశీర్వాదము
రా - శంకరాభరణము, తా ఆది
దేవర - నీ - దీవెనలు ధారాళముగను వీరలపై = బాగుగా వేగమెదిగనిమ్ము - పావన యేసునిద్వారగను ||దేవర||
1.దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స - హింపున వీరు సుఖించుటకై ||దేవర||
2.ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో = శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము ||దేవర||
3.ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచుదా = మెప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకను బంపు కృపన్ ||దేవర||
4.తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగా = గాపుగ బ్రాపుగ దాపునుండి - యాపదలన్నియు బాపుచును ||దేవర||
5.సాధులుగన్ చేయుటకై - శోధనలచే నీవు శోధింపగా = కదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ ||దేవర||
6.మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను = తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండించవే ||దేవర||
7.ఇద్దర వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై = శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ ||దేవర||
8.వాసిగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని = మా సకలేశ్వర నీ సుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్ ||దేవర||
- అల్లారి పెద్ద వీరాస్వామి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment