327
దావీదు కీర్తన: 139
పశ్చాతాప గీతి
రా - భూపాళము, తా - త్రిపుట
(చాయ : చింత లేదిక)
దేవ నీవు నన్ను బరిశో - ధించి బాగుగ దెలిసికొంటివి -
నీ వెఱుగుదువు నేను కూర్చుండుటయును - నే లేచుటయును ॥దేవ||
1.నాకు దలపులు పుట్టినపుడే - నా మనస్సు గ్రహించి నాడవు = ప్రాకటంబుగనా నడక నా పడకను - పరిశీలించితి ||దేవ||
2.నీకు నా సమస్త చర్యల - నిజము తెలియును నా మాట నాల్కకు - రాకపూర్వము దేవ సర్వము బూర్తిగా - నీకే - తెలియును ||దేవ||
3.నా వెనుకను ముందునుండి - నన్ను నావరించి నీ చెయ్యి - నీవు నాపయి నుంచితివి నా మది కది - కేవల మందదు ||దేవ||
4.అరుగుదెంచెద నెచ్చటికి నీ - యాత్మయొద్ద నుండి యింక నీ = పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికి బారిపోవుదు ||దేవ||
5. ఏను వేకువ టెక్కలను ధరి - యించి కడలిలో నున్న నీ చేయి = మానక నడిపించు నీ దుడిచేయియు - మరి నను గైకొను ||దేవ||
6. నను సృజించిన తెలుగెఱుంగగ - నాకు భయమాశ్చర్య మొదవును = గనుక నీకును నే గృతజ్ఞతాస్తుతులను జల్లింతును ||దేవ||
7. నేను పిండం బైన యప్పుడు - నీవు నను వీక్షించినాడవు = నేను బ్రతుకుటకు ముందె లిఖితంబాయెను - నీ గ్రంథంబులో ||దేవ॥
8. నిక్కముగ దేవా నీ తలపు - లెక్కువ ప్రియ మగును నాకును = లెక్కకు నెక్కు వౌ ||దేవ॥
-మల్లెల దావీదు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment