568
గృహ ప్రవేశము
(చాయ: ఆలించు దేవ)
రా – శ్రీ రాగము, తా – అట
దీవించు దేవా - నీ బిడ్డలను దీవించు దేవా = దీవించుమీ గృహము - దేవపుత్రుల మంచి - స్థావరంబుగ వెలసి - సత్యకాంతుల బరుప ||దీవించు||
1.నీవే యీ గృహమునకు - నిత్యతల పతివంచు - నేవేళ నీ మనసు - నెరిగి జీవింపగ ||దీవించు||
2.సంభాషణలవేళ - సన్నిహితుడా నీకు - సంబరంబును - గూర్చు సద్వాక్కులను బలుక ||దీవించు||
3.భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను - పూజ్యుండౌ యతిధిగ పూజసల్పుచు బిలువ ||దీవించు||
4.ఇరుగుపొరుగులనెల్ల - పరవారివలెగాక - పరమాత్మనీసుతుల - వలె జూచి ప్రేమింప ||దీవించు||
5.అనుదిన ప్రార్థన - లందు శ్రద్ధాభక్తు - లను జూపి క్రైస్తవ - యనుభవంబుల నొంద ||దీవించు||
6.క్రైస్తవగృహ విధులీ - గృహమున నెరవేర - విస్తారమగు కృపను - వీర లందరి కొసరి ||దీవించు||
7.ఆయురారోగ్యంబు - లాత్మైశ్వర్యములిచ్చి - ఈ యూర వీరు నీ కింపగు సాక్ష్యము నియ్య ||దీవించు||
- పి.పి. శుభామణి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment