650
చూడుము గెత్సెమనే - తోటలో నా ప్రభువు - పాపినాకై వి - జ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది - పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది1.దేహమంతయు నలగి - శోకము చెందిన వాడై దేవాది దేవుని - ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||
2. తండ్రి ఈ పాత్ర తొలగున్ - నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ - చిత్తము చేయుటకు నన్నప్పగించితి వనెను ||
3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది రక్షకుడేసు - హృదయము పగులుగ - విజ్ఞాపనము చేసెనే ||
4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే - మన యేసు ప్రభువు - తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ||
5. ప్రేమామృత వాక్కులచే - ఆదరించెడి ప్రభువు - వేదన సమయమున - బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే ||
6. నన్ను తనవలె మార్చెడి - ఈ మహా ప్రేమను త - ల - చి తలచి హృదయము కరుగగ - సదా కీర్తించెదను ||చూడుము||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment