Chudare Siluvanu Vreladu | చూడరే సిలువను వ్రే

193
సిలువమిఁది క్రీస్తు
రా - హిందుస్థాని కాపి, తా - త్రిపుట

చూడరే సిలువను - వ్రే - లాడు యేసయ్యను = పాడు లోకంబునకై గోడు జెందె గదా  ||చూడరే||

1.నా చేతులు చేసినట్టి - దోషంబులే గదా = నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||

2.దురితంపు దలపులే - పరమగురుని శిరముపై = నెనరులేక మొత్తనయ్యో - ముండ్ల కిరీటమై ||చూడ||

3. పరుగెత్తి పాదములు - చేసిన పాపంబులు = పరమ రక్షకుని - పాదములలో మేకులు ||చూడ||

4.పా పేచ్ఛ తోడగూడు - నాదు చెడ్డ పడకలే = పరమ గురుని ప్రక్కలోని - బల్లెంపు పోటులు ||చూడ||
    – ఒంగోలు అబ్రహాము

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: