Enduko Nanninthaga Neevu | ఎందుకో నన్నింతగా నీవు

638
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా 
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా ||ఎందుకో||

1.నాపాపము బాప - నరరూపివైనావు 
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి 
నాకు చాలిన దేవుడవునీవే - నా స్థానములో నీవే ||ఎందుకో||

2.నీ రూపము నాలో - నిర్మించియున్నావు 
నీ పోలికలోనే - నివసించుచున్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీకొరకై నీ కృపలో ||ఎందుకో||

3.నా శ్రమలు వహించి - నా ఆశ్రయమైనావు 
నా వ్యధలు భరించి - నన్నాదుకొన్నావు 
నన్ను నీలోచూచుకొన్నావు - నను దాచియున్నావు ||ఎందుకో||

4.నీ సన్నిధి నాలో - నా సర్వస్వము నీలో 
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు - నన్ను విడువ నంటివో దేవా ||ఎందుకో||

5.నా మనవులు ముందే - ఏ మనస్సులో నెరవేరే
నా మనుగడ ముందే - నీ గ్రంథంబులో నుండె
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతున్ ||ఎందుకో||
                           - తుమటి మోసెస్ గారు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: