682
యెహూవా నాబలమా - యధార్థమైనది నీ మార్గం -పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహూవా||
1.నా శత్రువులు నను చుట్టినను -
నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన -
వదలక నను ఎడబాయని దేవా ||యెహూవా||
2.మరణపు టురులలో మరువక మొరలిడ -
ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొరవినెను
అదరెను ధరణి భయకంపముచే ||యెహూవా||
3.నా దీపమును వెలిగించువాడు .
నా చీకటిని వెలుగుగ జెయున్
జలరాసులనుండి బలమైన చేతితో -
వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహూవా||
4.పౌరుషముగల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులు వణకెను
తన నోటి నుండి వచ్చిన అగ్ని -
దహించివేసెను వైరుల నెల్లను ||యెహూవా||
5.మేఘములపై ఆయన వచ్చును -
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగజేసి -
అపజయమిచ్చును అపవాదికిని ||యెహూవా||
6.దయగలవారి పై దయచూపించును -
కఠినుల యెడల వికటము జూపును
గర్విష్ఠుల యొక్క గర్వము నణచును -
సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహూవా||
7.నా కాళ్ళను లేడికాళ్ళగ జేయును -
యెత్తైన స్థలములో శక్తితో నిలపి
రక్షణ కేడెము నాకందించి -
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహూవా||
8.యెహూవా జీవముగల దేవా -
బహుగ స్తుతులకు అర్హుడ వీవు
అన్యజనులలో ధన్యతజూపుచు -
హల్లెలూయ స్తుతిగానము జేసెద ||యెహూవా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment