Ye papamerugani yo pavana | ఏ పాపమెరుగని

186
సిలువపై క్రీస్తుని ప్రేమ
రా - నాధనామా క్రియ, తా - కురుజంపె

ఏ పాప మెఱుఁగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ = నా పాలి దైవమా - నా పాపముల కొఱ - కీ పాట్లు నొందినావా ||యే పాప||

1.ముళ్లతోఁ గిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా = ముళ్లపోట్లకు శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా ||యే పాప||

2.కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా = సిలువ నీతో మోయఁ - తులువలు వేఱొకనిఁ - దోడుగా నిచ్చినారా ||యే పాప||

3.చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా = కడకుఁ కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్కున దించినావా ||యే పాప||

4.ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు సేతులు - ఆ కొయ్యకే నూది - మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||

5.పలువిధంబుల శ్రమలు - చెలరేగఁ దండ్రికి - నెలుగెత్తి మొఱలిడితివా = సిలువపైఁ బలుమాఱు - కలుగుచుండెడి బాధ - వలన దాహము నాయెనా ||యే పాప||

6.బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్కఁ - జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా = ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగఁ - జల్లారెఁగద కోపము ||యే పాప||

7.కటకటా పాప సం - కటముఁ బాపుట కింత - పటుబాధ నొంది నావా - ఎటువంటి దీ ప్రేమ - యెటువంటి దీ శాంత - మెటుల వర్ణింతు స్వామి ||యే పాప||
 - యర్మణశెట్టి దావీదు

 DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: