Swachanda siyonu vasi | స్వచ్ఛంద సీయోనువాసి

693
స్వచ్ఛంద సీయోను వాసి - సర్వధికారి కస్తూరిపూ రాసి 
వర్తమాన భూత భవిషత్కాలవాసి - అల్ప ఓమేగ - తానే - అద్యంతము మన యేసే. ||స్వచ్ఛంద||

1.ఇదిగో నే నొక నిబంధనను - అద్భుతముగ జేతున్ 
నీ ప్రజలందరి యెదుట - పరిశోధింపజాలని మహా - 
పనులెల్ల 
ప్రభు వే - లెక్క లేని ఆద్భుతముల్ - మక్కువతో చేయువాడు ||స్వచ్ఛంద||

2.సంగీతనాదములతోడ - సియోను పురము -
సొంపుగను చేరితిమి 
శాశ్వత సంతోషము - మా శిరముల పై వెలసెన్ - దుఃఖము 
నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందము కల్గెన్||స్వచ్ఛంద||

3.నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో
మాణిక్యమణులతో - సువర్ణ సునీయములతో
సూర్యకాంతముతో - ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగా - నిను కట్టెదను ||స్వచ్ఛంద||

4.సమముల హారము - సంతోషానందతైలము నీవె
స్తుతి వస్త్రమును నీవే - ఉల్లాస వస్రంబు నీవే
విడుదలయు నీవే - హితవత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీవే ||స్వచ్ఛంద||

5.జలములలో బడి దాటునపుడు బలమై యుండెదను 
నీతోడై యుండెదను - నదులలో బడి వెళ్ళునప్పుడు 
నీపై పారవు - అగ్ని మధ్యను నడచినను 
జ్వాలలు నిను కాల్చగలేవు ||స్వచ్ఛంద||

6.ఇత్తడి తలుపులు - పగులగొట్టెద - నినుప గడియలను 
విడగొట్టెదను నేను - అంధకార స్థలములలో నున్నటి నిధులును 
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను ||స్వచ్ఛంద||

7.గర్భమున పుట్టినది మొదలు - తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న నాదు ప్రజ 
లారా - ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తి కొనువాడను నేనే ||స్వచ్ఛంద||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: