584
ప్రభువా నిన్ను స్తుతింతము
రా - యదుకుల కాంభోజీ, తా - త్రిపుట
(చాయ: తనువు నాదిదిగో)
స్తుతియింతుమో ప్రభువా - శుభమౌ నీదినమున - పరిశుద్ధమగు నీ నామము = గతకాలమున నీవు - పతితుల మగు మాకు - అతిదయతో జేసిన - యన్ని మేలులు దలచి॥స్తుతి||
1.ఎన్న శక్యముగాక - యున్న మహిమతో వెలుగు - చున్న నీ పదసన్నిధిన్ = సన్ను తాత్మా మేము - ఆత్మతో సత్యముతో - నిన్నారాధింతుము యీ - చెన్నౌ నీ గృహమందు||స్తుతి||
2.ఇచట నీ వాక్యము - నుచితరీతిని చాట - నీ సేవకుల నందఱిన్ = శుచియౌ నీ యాత్మతో - పరిపూర్ణముగ నింపి - ప్రచురింపను శక్తి - నధికముగ నిమ్ము ||స్తుతి||
3.భక్తితో నీ జనులు - యుక్తముగ నిను వేడ - శక్తి వారి కిమ్మెపుడు = ముక్తి కోసము నిన్నా - సక్తితో ప్రార్ధింప - రక్తితో విని వారి - కానందమును గూర్చు ||స్తుతి||
4.జనక కుమారాత్మ - లను దేవ నీ కెప్పు - డెనలేని స్తుతి కల్గును = అనయము మేమిలలో - కొనియాడుటకు నిన్ను - ఘనుడా దీవెన మాపై - కుమ్మరింపుము వేగ||స్తుతి||
– బి.ఇ.దేవరాజు
No comments:
Post a Comment