675
ప్రభు యేసుని వదనములో - నా దేవుని రాజ్యములో - పరికించిన శుభదినము - గమనించిన యాక్షణము -పరలోకముకై చిరజీవముకై - ప్రార్థించెను నా హృదయం ||ప్రభు||
దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో - దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును - ధన పీడనతో మృగ వాంఛలతో - దిగజారితి చావునకు||ప్రభు||
యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు - ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని - ఇల వేడితిని విలపించుచును - ఈడేరును నా వినతి ||ప్రభు||
పరదైనున ఈ దినమే - నా ఆనందముతోను - పాల్గొందువు నీవనుచు - వాగ్దానము చేయగనే పరలోకమె నా తుది వూపిరిగా - పయనించితి ప్రభుకడకు ||ప్రభు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment