Paradeshulamo priyulaaraa | పరదేశులమో ప్రియులారా

483
జీవిత యాత్ర
రా - ముఖారి,  తా - ఆది

పరదేశులమో ప్రియులారా మన = పురమిది  గాదెపుడు - నిజముగ ||బరదేశుల||

1.చిత్ర వస్తువులు - చెల్లెడి యొక వి = చిత్రమైన సంత - లోకము ||పరదేశుల||

2.సంత గొల్లు క్షమ - సడలిన చందం = బంతయు సద్దణగున్- నిజముగ ॥బరదేశుల||

3.స్థిర మని నమ్మకు - ధర యెవ్వరికిని = బరలోకమె స్థిరము - నిజముగ ||బరదేశుల||

4.మేడలు మిద్దెలు - మేలగు సరకులు = పాడై కన బడవే - నిజముగ ॥బరదేశుల||

5.ధన ధాన్యంబులు - దరగక మానవు = పనిపాటలు పోయె - నిజముగ ||భరదేశుల||

6.ఎన్ని నాళ్లు మన - మిలలో బ్రతికిన = మన్నై పోవునుగా - దేహము ||బరదేశుల||

7.వచ్చితి మిచటికి - వట్టి హస్తముల = దెచ్చిన దేదియు లేదు గదా ||పరదేశుల||

8.ఎట్లు వచ్చితిమి - యీ లోకమునకు = అట్లు వెళ్లవలయున్ - మింటికి॥బరదేశుల||

9.యేసు నందు వి - శ్వాసం బుంచిన = వాసిగ నిను జేర్చున్ - బరమున ||బరదేశుల||

10.యేసే మార్గము - యేసే సత్యము = యేసే జీవముగా - నిజముగ ॥బరదేశుల|| 
    - గొల్లపల్లి నతానియేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: