Margamu chupumu Intiki | మార్గము చూపుము

681
మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము - చూపించు కంటికి (2)

1.పాప మమతలచేత పారిపోయిన నాకు - ప్రాప్తించె క్షామము - 
పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమ గోరుచు - పంపుము క్షేమము - 
ప్రభు నీదుసిలువ ముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము  ||మార్గ||

2.ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు - తండ్రిని వీడితి - 
దరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ - దేహి నినుచేరితి -  
దేహీ అని నీవైపు చేతులెత్తిననాకు - దారినిజూపుము ||మార్గ||

3.దూరదేశములోన బాగుండు ననుకొనుచు - తప్పితి మార్గము - 
తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల - తరిమే దారిద్ర్యము -
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి - ధన్యుని జేయుము ||మార్గ||

4.అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు - ఆకలి బాధలో - 
అన్యాయమయి పోయె పందులుసహ వెలి వేయ - అలవడెను వేదన - 
అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత - ఆశ్రయము గూర్చుము ||మార్గ||

5.కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు - కోపించి వెళ్ళితి - 
కూలివానిగనైన నీయింట పనిచేసి - కనికరమే కోరుదు -
కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము ||మార్గ||

6.నాతండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి - నా పైబడి ఏడ్చెను - 
నవజీవమును కూర్చి యింటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను - 
నా జీవితకథయంత యేసుప్రేమకు ధరలో - సాక్ష్యమై యుండును ||మార్గ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: